21 లక్షల మందికి రూ.4 వేల కోట్లు..!

దిశ, ఏపీ బ్యూరో: మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్​చేయూత పథకం ద్వారా రెండో విడత నగదు సాయాన్ని ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్​కమిషనరేట్​లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ చెక్కులను పంపిణీ చేశారు. రెండో దఫా 2.72 లక్షల మందికి రూ.18,750 చొప్పున రూ.510 కోట్ల నగదును లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారు. మొదటి విడత 21 లక్షల మంది లబ్దిదారులకు రూ.4 వేల కోట్లు అందించారు. 40 నుంచి 60 […]

Update: 2020-11-12 09:53 GMT

దిశ, ఏపీ బ్యూరో: మహిళల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్​చేయూత పథకం ద్వారా రెండో విడత నగదు సాయాన్ని ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్​కమిషనరేట్​లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ చెక్కులను పంపిణీ చేశారు. రెండో దఫా 2.72 లక్షల మందికి రూ.18,750 చొప్పున రూ.510 కోట్ల నగదును లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారు.

మొదటి విడత 21 లక్షల మంది లబ్దిదారులకు రూ.4 వేల కోట్లు అందించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీఎస్టీ బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ది చేకూరుస్తున్నారు. తద్వారా మహిళలు స్వయం ఉపాధితో ఆయా కుటుంబాలకు చేదోడుగా నిలుస్తారని పంచాయతీ రాజ్​ప్రిన్సిపల్​సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. ప్రముఖ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మహిళల ఉపాధికి బంగారు బాటలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News