పోటాపోటీగా నామినేషన్లు
దిశ, పటాన్ చెరు:బల్దియా ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు మూడు డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులు పోటాపోటీగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. మూడు డివిజన్లలో కలిపి మొత్తం 27 మంది నామినేషన్లను దాఖలు చేశారు. పటాన్ చెరు (113) డివిజన్‌లో అత్యధికంగా 11 మంది 15 నామినేషన్లను వేశారు. టీఆర్ఎస్ నుండి కార్పొరేటర్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్, భారతీనగర్ 111 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి వి.సింధూ ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం 112 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి […]
దిశ, పటాన్ చెరు:బల్దియా ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు మూడు డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులు పోటాపోటీగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. మూడు డివిజన్లలో కలిపి మొత్తం 27 మంది నామినేషన్లను దాఖలు చేశారు. పటాన్ చెరు (113) డివిజన్‌లో అత్యధికంగా 11 మంది 15 నామినేషన్లను వేశారు. టీఆర్ఎస్ నుండి కార్పొరేటర్ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్, భారతీనగర్ 111 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి వి.సింధూ ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం 112 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్‌లు గురువారం నామినేషన్లను దాఖలు చేశారు.
రామచంద్రాపురం డివిజన్‌లో ఏడు మంది ఎనిమిది నామినేషన్లను దాఖలు చేశారు. భారతి నగర్ డివిజన్‌లో నలుగురు తమ నామినేషన్లను వేశారు. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి పరమేశ్ యాదవ్, బీజేపీ పార్టీ నుండి బి.బాలమురళీకృష్ణ, బీజేపీ పార్టీ నుండి ఆశీష్ గౌడ్, స్వతంత్య్ర అభ్యర్థులు ఆకుల అరుణ భారతీనగర్, పటాన్ చెరు డివిజన్ కార్పొరేటర్ స్వతంత్య్ర అభ్యర్థిగా గుండు ప్రదీప్ కమార్ నామినేషన్ దాఖలు చేశారు.