పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్‌ ఒప్పందానికి సెబీ బ్రేక్

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఒప్పందానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బ్రేక్ వేసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ గ్రూపునకు వాటా విక్రయించి రూ. 4 వేల కోట్లను నిధుల సమీకరణ ఒప్పందాన్ని నిలిపేయాలని సెబీ ఆదేశాలిచ్చింది. బుక్ వాల్యూ కంటే తక్కువకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లను విక్రయిస్తున్నారని సెబీకి ఫిర్యాదు అందింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసిన నేపథ్యంలో […]

Update: 2021-06-20 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఒప్పందానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ బ్రేక్ వేసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లయిల్ గ్రూపునకు వాటా విక్రయించి రూ. 4 వేల కోట్లను నిధుల సమీకరణ ఒప్పందాన్ని నిలిపేయాలని సెబీ ఆదేశాలిచ్చింది. బుక్ వాల్యూ కంటే తక్కువకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లను విక్రయిస్తున్నారని సెబీకి ఫిర్యాదు అందింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసిన నేపథ్యంలో సెబీ తాజా ఆదేశాలపై ఆసక్తి సంతరించుకుంది.

కార్లయిల్ గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఆదిత్యపురి హెచ్‌డీఎఫ్‌సీఎ బ్యాంకులో ఉన్నత పదవిలో ఉన్నారు. ఈ ఒప్పందానికి ఆయనే కీలకంగా వ్యవహరించారని, కార్లయిల్ గ్రూప్ ద్వారా రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో పాటు ఆయన కీలక పదవిని చేపట్టనున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వృద్ధి మరింత వేతవంతం అవుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం మదింపు ప్రక్రియను నిర్వహించాలని కంపెనీని సెబీ ఆదేశించింది.

Tags:    

Similar News