గనిలో కొనసాగుతున్న అన్వేషణ
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం 11ఏ గనిలో మంగళవారం కనిపించకుండా పోయిన సంజీవ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యాక్టింగ్ పంప్ ఆపరేటర్‌గా అత్యవసర సేవలు అందించేందుకు సంజీవ్ మంగళవారం గనిలోకి దిగి, గల్లంతయ్యాడు. 16 బృందాలు 24గంటలుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రోజు గడిచినా ఫలితం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్జి-1 జీఎం సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌లు గనిలోకి దిగి రక్షణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. తెల్లవారు […]
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం 11ఏ గనిలో మంగళవారం కనిపించకుండా పోయిన సంజీవ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. యాక్టింగ్ పంప్ ఆపరేటర్‌గా అత్యవసర సేవలు అందించేందుకు సంజీవ్ మంగళవారం గనిలోకి దిగి, గల్లంతయ్యాడు. 16 బృందాలు 24గంటలుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రోజు గడిచినా ఫలితం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్జి-1 జీఎం సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కొరుకంటి చందర్‌లు గనిలోకి దిగి రక్షణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. తెల్లవారు జామునే రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగినా ఫలితం మాత్రం కనిపించలేదు.
Tags: ramagundam mine, acting operator, missing in mine, peddapally, rescue team, mla korukanti chandar