ఏపీలో స్కూల్స్ రీఓపెన్.. డేట్ ఫిక్స్ చేసిన జగన్

దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈలోగా నాడు-నేడులో భాగంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడులో పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించినరోజే రెండో విడత నాడు-నేడు […]

Update: 2021-07-23 03:02 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈలోగా నాడు-నేడులో భాగంగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి విడత నాడు-నేడులో పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభించినరోజే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. అలాగే కొత్త విద్యావిధానం అమలులోకి రానున్న నేపథ్యంలో.. ఈ విద్యావిధానం గురించి ప్రభుత్వం సమగ్రంగా విశ్లేషణ చేయాలన్నారు. అలాగే పాఠశాలలు తిరిగి ప్రారంభించిన నాడే విద్యార్థులకు విద్యా కానుక కిట్టులు కూడా అందజేయాలన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags:    

Similar News