స్కూళ్లు తెరవడం ఇప్పట్లో కష్టమే..!

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలలు తెరవాలనే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రానున్న రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం కానుందని వైద్యాధికారులు హెచ్చరించడంతో దీనిపై ప్రభుత్వం వెనగ్గి తగ్గినట్లు తెలుస్తోంది. దాంతో స్కూళ్లు ప్రారంభించే నిర్ణయాన్ని రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.మొదట ఈనెల 16 నుంచి పాఠశాలలు తెలవాలని తమిళ సర్కార్ నిర్ణయించింది. చలికాలం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యాధికారుల నివేదిక మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ […]

Update: 2020-11-12 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పాఠశాలలు తెరవాలనే నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రానున్న రోజుల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం కానుందని వైద్యాధికారులు హెచ్చరించడంతో దీనిపై ప్రభుత్వం వెనగ్గి తగ్గినట్లు తెలుస్తోంది. దాంతో స్కూళ్లు ప్రారంభించే నిర్ణయాన్ని రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.మొదట ఈనెల 16 నుంచి పాఠశాలలు తెలవాలని తమిళ సర్కార్ నిర్ణయించింది.

చలికాలం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యాధికారుల నివేదిక మేరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పిల్లలను స్కూళ్లకు పంపించబోమని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విన్నవించారు. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకున్న సీఎం పళనిస్వామి సర్కార్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూళ్లను తెరవకూడదని ఆదేశించింది.

Tags:    

Similar News