శుభవార్త: చదువుకోవడానికి స్కాలర్షిప్ అందిస్తున్న U-GO
ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతులకు ఆర్థిక సహాయం అందించేందుకు U-Go స్కాలర్షిప్ ప్రోగ్రాం చేపట్టింది..Latest Telugu News
స్కాలర్షిప్: ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతులకు ఆర్థిక సహాయం అందించేందుకు U-Go స్కాలర్షిప్ ప్రోగ్రాం చేపట్టింది. టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్..వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న యువతులు ఈ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
టీచింగ్, నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, ఇంజనీరింగ్..వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న యువతులు అర్హులు.
గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది చదువుతున్న యువతులై ఉండాలి.
10,12 తరగతుల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించరాదు.
భారతీయ యువతులు మాత్రమే అర్హులు.
స్కాలర్షిప్-
టీచింగ్ కోర్సులకు రెండేళ్ల కాలానికి రూ. 40,000.
నర్సింగ్ అండ్ ఫార్మా కోర్సులకు నాలుగేళ్లలో రూ. 40,000.
ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సు చదివే యువతులకు రూ. 60,000 నాలుగేళ్ల కోర్సుకు అందిస్తారు.
స్కాలర్షిప్ మొత్తాన్ని యువతులు తమ అకడమిక్ ఖర్చులైన ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్, ట్రావెల్, ఇంటర్నెట్, పుస్తకాలు, స్టేషనరీ, ఆన్‌లైన్ కోర్సులకు ఉపయోగించుకోవాలి.
కావలసిన పత్రాలు:
12వ తరగతి మార్క్స్ షీట్
ప్రభుత్వం అందించిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు/ఓటర్ ఐడి/పాన్ కార్డ్)
ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్ (ఫీజు రిసిప్ట్/ఐడి కార్డ్/అడ్మిషన్ లెటర్/బోనఫైడ్)
కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఐటిఆర్ ఫార్మ్ 16/ఇన్‌కమ్ సర్టిఫికెట్/సాలరీ స్లిప్)
అకడమిక్ ఖర్చులకు ఖర్చుచేసిన రిసిప్ట్స్..
బ్యాంక్ అకౌంట్ వివరాలు
ఫొటోగ్రాఫ్
దరఖాస్తు: ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: నవంబర్ 30, 2022.
వెబ్‌సైట్: https://www.buddy4study.com