ఎన్ఐటీ విద్యార్థికి రూ.2 కోట్ల స్కాలర్ షిప్.. సూపర్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు

హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ ఎన్ఐటీ కి చెందిన దీపక్ భరద్వాజ్ అనే విద్యార్థి రూ.2 కోట్ల ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్ ను సాధించాడు.

Update: 2023-08-05 12:15 GMT

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ ఎన్ఐటీ కి చెందిన దీపక్ భరద్వాజ్ అనే విద్యార్థి రూ.2 కోట్ల ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్ ను సాధించాడు. ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో ఎమ్మెస్సీ చేస్తున్న దీపక్ భరద్వాజ్.. క్వాంటమ్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీకి ప్రపోజల్ పంపగా బ్రిస్టల్ యూనివర్సిటీ దీపక్ ను స్కాలర్ షిప్ కు ఎంపిక చేసింది. కాగా క్వాంటమ్ ఫిజిక్స్ లో పీహెచ్ డీ చేయడానికి సదరు విద్యార్థి బ్రిస్టల్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు.

ఈ క్రమంలోనే ప్రొఫెసర్ జార్జ్ బారెట్ మార్గదర్శకత్వంలో దీపక్ క్వాంటమ్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ చేయనున్నారు. కాగా దీపక్ కు రూ.2 కోట్ల స్కాలర్ షిప్ రావడంపై ఎన్ఐటీ సిబ్బంది, స్టూడెంట్స్ తో పాటు అతడి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News