బీడీఎస్ విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్షిప్
ప్రతిభావంతులైన బీడీఎస్ చదవాలనుకునే విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతోపాటు
దిశ, స్కాలర్షిప్: ప్రతిభావంతులైన బీడీఎస్ చదవాలనుకునే విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్ లను అందిస్తుంది. 12వ తరగతి పూర్తయి బీడీఎస్ చదవాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: 60 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
బీడీఎస్ చదవడం కోసం ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించరాదు.
ప్రయోజనాలు :
ఏడాదికి రూ. 50,000 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
గుర్తింపు కార్డు
ఆదాయ ధ్రువీకరణ
12 వ తరగతి మార్క్స్ షీట్
అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్
చివరి తేదీ: మార్చి 31, 2023
వివరాలకు వెబ్సైట్: https://www.buddy4study.com