ఇంటర్ చదివే విద్యార్థులకు రూ. 20,000 స్కాలర్‌షిప్.. పూర్తి వివరాలు ఇవే
ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతోపాటు,
దిశ, స్కాలర్షిప్: ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్ లను ఇస్తుంది. 10వ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: 75 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్ చదవడం కోసం ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకుని ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించరాదు.
ప్రయోజనాలు :
ఏడాదికి రూ. 20,000 చొప్పున మూడేళ్ల పాటు అందిస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
గుర్తింపు కార్డు
ఆదాయ ధ్రువీకరణ
10 వ తరగతి మార్క్స్ షీట్
అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్
చివరి తేదీ: మార్చి 31, 2023
వివరాలకు వెబ్‌సైట్: https://www.buddy4study.com