యూజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ. 2 లక్షల స్కాలర్‌షిప్

అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది

Update: 2023-01-06 14:25 GMT

స్కాలర్ షిప్: అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఆర్థిక భారంతో తమ చదువులను కొనసాగించలేని విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:

గుర్తింపు పొందిన సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది చదువుతూ ఉండాలి.

60 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలకు మించరాదు(రూ. 2.50 లక్షల లోపు ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది)

భారతదేశ పౌరులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

స్కాలర్‌షిప్ మొత్తం:

డిగ్రీ ప్రోగ్రాం మొత్తానికి రూ. 2 లక్షల వరకు అందిస్తారు.

కావలసిన పత్రాలు:

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో

అడ్రస్ ప్రూఫ్

10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్.

ప్రస్తుత బోనఫైడ్ సర్టిఫికెట్

ఇన్‌కమ్ ప్రూఫ్

చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2023

వెబ్‌సైట్: https://www.scholarships.reliancefoundation.org


Similar News