విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మల్లారెడ్డి యూనివర్సిటీ రూ. 10 కోట్ల స్కాలర్ షిప్
MRUCET కామన్ ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్‌లను అందిస్తోంది.
దిశ, కెరీర్: MRUCET కామన్ ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్‌లను అందిస్తోంది. 2023-24 అకాడమిక్ ఇయర్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయం, పారామెడికల్, మేనేజ్మెంట్ & పబ్లిక్ పాలసీల్లో ఉన్న కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. వి.ఎస్.కె రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రవేశ పరీక్షలో ఇండియాలోని అన్ని రాష్ట్రాల బోర్డులు, సెంట్రల్ బోర్డ్, ఇతర గుర్తింపు పొందిన సంస్థల విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నామని, ప్రవేశాల కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (MRUCET) ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రొఫెసర్‌లతో విద్యను అందిస్తూన్నామని, దీని ద్వారా విశ్వవిద్యాలయాల్లో చెరగని ముద్ర వేశామన్నారు. ఎమర్జింగ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్‌లను అందించే మొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ.. మల్లారెడ్డి యూనివర్సిటీ అని వైస్ చాన్సలర్ డా.వి. ఎస్.కె రెడ్డి తెలిపారు.
వివరాలకు వెబ్‌సైట్: www.mallareddyuniversity.ac.in