గ్రాడ్యుయేట్‌లకు శుభవార్త..

డ్రైవర్ పిల్లల చదువులను కొనసాగించే ఉద్దేశంతో మహీంద్రా ఫైనాన్స్.. సాక్షమ్ స్కాలర్‌షిప్ అందిస్తోంది.

Update: 2022-11-12 16:22 GMT

దిశ, కెరీర్: డ్రైవర్ పిల్లల చదువులను కొనసాగించే ఉద్దేశంతో మహీంద్రా ఫైనాన్స్.. సాక్షమ్ స్కాలర్షిప్ అందిస్తోంది. గ్రాడ్యుయేట్ చదువుతున్న డ్రైవర్ల పిల్లలు విద్యాపరమైన, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవాలని ఆశిస్తూ మహీంద్రా ఫైనాన్స్ ఈ అవకాశం కల్పిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన అర్హులైన విద్యార్థులు సాక్షమ్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: గ్రాడ్యుయేషన్ చదువుతున్నవారు అర్హులు

గత పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.

వ్యాలిడ్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 4 లక్షలకు మించి ఉండరాదు.

నోట్: కుటుంబంలో ఇద్దరి పిల్లల వరకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది.

స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి గాను.. రూ. 15000 అందిస్తారు.

ధ్రువపత్రాలు:

గత పరీక్షల మార్క్ షీట్

ఫోటో ఐడెంటిటీ

ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్

అడ్మిషన్ ప్రూఫ్

బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్

కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవర్ కాంట్రాక్ట్ ప్రూఫ్ /ఐడికార్డ్

అడ్రెస్ ప్రూఫ్

ఫొటో గ్రాఫ్

చివరితేది: డిసెంబర్ 31, 2022

వెబ్‌సైట్: https://www.buddy4study.com


Similar News