విద్యార్థుల చదువుకు రూ. 20 వేల స్కాలర్‌షిప్ ఇస్తోన్న LIC

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ - 2022 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది.

Update: 2022-12-02 16:32 GMT

స్కాలర్‌షిప్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ - 2022 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది.

అర్హత: రెగ్యులర్ స్కాలర్: 2021 - 22 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించరాదు.

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న వారు అర్హులు.

స్పెషల్ గర్ల్ చైల్డ్: పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించింది.

అర్హత: 2021-22 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించరాదు.

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటీఐ అభ్యసిస్తున్న బాలికలు అర్హులు.

స్కాలర్‌షిప్:

రెగ్యులర్ స్కాలర్ పథకానికి ఏడాదికి రూ. 20,000 ఉంటుంది.

స్పెషల్ గర్ల్ చైల్డ్ పథకానికి రూ. 10,000 అందిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 18, 2022

వెబ్‌సైట్: https://licindia.in


Similar News