గ్రాడ్యుయేట్లకు హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్షిప్ .. ప్రయోజనాలు ఇవే

వెనుకబడిన విద్యార్థుల చదువులను కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బాద్‌తే స్కాలర్షిప్ అందిస్తోంది.

Update: 2023-01-10 17:19 GMT

స్కాలర్షిప్: వెనుకబడిన విద్యార్థుల చదువులను కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బాద్‌తే స్కాలర్షిప్ అందిస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అదనంగా మెంటర్షిప్, కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లను కూడా అందిస్తుంది. ఈ స్కాలర్షిప్‌ను విద్యార్థులు అకడమిక్ ఫీజులకు, ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, స్టేషనరీ వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

అర్హత:

12వ తరగతి పూర్తయి, గుర్తింపు పొందిన సంస్థల్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు.

గత బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.

భారతీయ పౌరులు అయి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: రూ. 30000

డాక్యుమెంట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

గత బోర్డు పరీక్షల మార్క్స్ షీట్.

ఐడీ ప్రూఫ్

ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్

దరఖాస్తు దారుని బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్

ఇన్‌కమ్ ప్రూఫ్

అఫిడవిట్..

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com


Similar News