విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ గుడ్‌న్యూస్ .. స్కాలర్షిప్ ఎంతంటే..?

వెనుకబడిన విద్యార్థుల చదువులను కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బాద్‌తే స్కాలర్షిప్ అందిస్తోంది.

Update: 2023-01-10 17:15 GMT

స్కాలర్షిప్: వెనుకబడిన విద్యార్థుల చదువులను కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బాద్‌తే స్కాలర్షిప్ అందిస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అదనంగా మెంటర్షిప్, కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లను కూడా అందిస్తుంది. ఈ స్కాలర్షిప్‌ను విద్యార్థులు అకడమిక్ ఫీజులకు, ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, స్టేషనరీ వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

అర్హత:

పదో తరగతి పూర్తయి, 11 లేదా 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు

గత బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండి ఉండాలి.

భారతీయ పౌరులు అయి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: రూ. 18,000

డాక్యుమెంట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

గత బోర్డు పరీక్షల మార్క్స్ షీట్.

ఐడీ ప్రూఫ్

ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్

దరఖాస్తు దారుని బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్

ఇన్‌కమ్ ప్రూఫ్

అఫిడవిట్..

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com


Similar News