కోర్టు ధిక్కార పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కార చట్టం రాజ్యంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, పాత్రికేయులు ఎన్ రామ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరు తమ పిటిషన్‌లో కోర్టు అధికారాన్ని భంగం కలిగించడం, నేరపూర్తి ధిక్కారంగా పరిగణిస్తూ చట్ట నిబంధన రాజ్యంగ బద్ధత, చెల్లుబాటును ప్రశ్నించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ […]
దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కార చట్టం రాజ్యంగ బద్ధతను ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, పాత్రికేయులు ఎన్ రామ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరు తమ పిటిషన్‌లో కోర్టు అధికారాన్ని భంగం కలిగించడం, నేరపూర్తి ధిక్కారంగా పరిగణిస్తూ చట్ట నిబంధన రాజ్యంగ బద్ధత, చెల్లుబాటును ప్రశ్నించడం జరిగింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం..ఈ పిటిషన్‌ను ఉపసంహరించేందుకు అనుమతి ఇస్తూ, సుప్రీంకోర్టు మినహాయించి ఇతర న్యాయ వేదికను ఆశ్రయించవచ్చని వెల్లడించింది. ప్రశాంత్ భూషన్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనం సమక్షంలో మాట్లాడుతూ..ఈ అంశంపై అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు వివరించారు. అలాగే, మళ్లీ తాము కోరినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశమివ్వాలని కోరారు.