కరోనా చికిత్స కోసం ప్రత్యేక రుణ సౌకర్యం ప్రారంభించిన ఎస్‌బీఐ

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెక్యూరిటీ అవసరంలేని వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కవచ్ పర్సనల్ లోన్’ పేరుతో తెచ్చిన ఈ వ్యక్తిగత రుణాన్ని కరోనా చికిత్స తీసుకుంటున్న వినియోగదారుల కోసం ప్రారంభించింది. కరోనా బారిన పడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ రుణ సౌకర్యంతో ప్రయోజనాలు ఉంటాయని ఎస్‌బీఐ తెలిపింది. ఈ రుణ సౌకర్యం ద్వారా కరోనా కారణంగా వైద్య ఖర్చులను చెల్లించలేని […]

Update: 2021-06-11 08:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెక్యూరిటీ అవసరంలేని వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కవచ్ పర్సనల్ లోన్’ పేరుతో తెచ్చిన ఈ వ్యక్తిగత రుణాన్ని కరోనా చికిత్స తీసుకుంటున్న వినియోగదారుల కోసం ప్రారంభించింది. కరోనా బారిన పడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ రుణ సౌకర్యంతో ప్రయోజనాలు ఉంటాయని ఎస్‌బీఐ తెలిపింది. ఈ రుణ సౌకర్యం ద్వారా కరోనా కారణంగా వైద్య ఖర్చులను చెల్లించలేని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు.

ఈ కవర్ పర్సనల్ లోన్ ద్వారా రూ. 5 లక్షల వరకూ రుణాన్ని తీసుకోవచ్చు. ఈ రుణంపై వడ్డీ రేటు ఏడాదికి 8.5 శాతం వడ్డీ అమలవుతుంది. అంతేకాకుండా లోన్ తీసుకున్న మొదటి మూడు నెలలు ఈఎంఐ చెల్లించక్కరలేదని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘అతి తక్కువ డ్డీతో ‘కవచ్ పర్సనల్ లోన్’ లభిస్తుంది. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన రుణ సౌకర్యాన్ని అందించడం సంతోషంగా ఉంది. ఈ లోన్‌తో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి కరోనా చికిత్స పొందవచ్చు. కరోనా మహమ్మారి సమయంలో ఇది ఎంతో మందికి ప్రయోజనాలు లభిస్తాయని’ ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు.

Tags:    

Similar News