SBI SPECIAL OFFER.. ఆ లోన్స్‌కు 'జీరో ప్రాసెసింగ్ ఫీజు'
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్బీఐ వినియోగదారుల కోసం గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తీసుకునే ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా..’ఈ ఏడాది దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గృహ రుణాలపై సున్నా ప్రాసెసింగ్ ఫీజును అందించడం ద్వారా మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి’ అని ఎస్బీఐ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎస్బీఐ వినియోగదారుల కోసం గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా తీసుకునే ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా..’ఈ ఏడాది దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గృహ రుణాలపై సున్నా ప్రాసెసింగ్ ఫీజును అందించడం ద్వారా మీ కలల ఇంటిని సొంతం చేసుకోండి’ అని ఎస్బీఐ తెలిపింది.
ఎస్బీఐ ఖాతాదారులు తీసుకునే గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని, అలాగే, ఎస్బీఐలోని మహిళా ఖాతాదారుల్కు 5బీపీఎస్ అంటే 0.05 శాతం వడ్డీ రాయితీ అందిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఖాతాదారులకు 5బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుందని బ్యాంకు వివరించింది. కాగా, ప్రస్తుతం ఎస్బీఐ ఖాతాదారులకు 6.7 శాతం వడ్డీతో గృహ రుణాలు పొందవచ్చని వెల్లడించింది.