ఎస్‌బీఐ కార్డ్ ఆన్‌లైన్ చెల్లింపులు 50 శాతంపైనే
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావంతో దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలకు డిమాండ్ పెరిగిందని ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసుల సంస్థ తెలిపింది. ఎస్‌బీఐ కార్డ్ చెల్లింపులు 50 శాతానికి పైగా ఆన్‌లైన్‌లోనే జరిగాయని, వీటిలో కిరాణా, యుటిలిటీ బిల్లు, బీమా ప్రీమియం చెల్లింపులు అధికంగా జరుగుతున్నట్టు ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ రామమోహనరావు అమరా చెప్పారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావంతో దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలకు డిమాండ్ పెరిగిందని ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసుల సంస్థ తెలిపింది. ఎస్‌బీఐ కార్డ్ చెల్లింపులు 50 శాతానికి పైగా ఆన్‌లైన్‌లోనే జరిగాయని, వీటిలో కిరాణా, యుటిలిటీ బిల్లు, బీమా ప్రీమియం చెల్లింపులు అధికంగా జరుగుతున్నట్టు ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ రామమోహనరావు అమరా చెప్పారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ చెల్లింపులు మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
దేశీయంగా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులే కాకుండా వస్తువులు, సేవల చెల్లింపులు పెరిగేందుకు అవకాశాలున్నాయని రామమోహనరావు తెలిపారు. ఇదివరకు ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ కార్డు చెల్లింపులు దాదాపు 44 శాతం ఉండేవి. ఇది 53 శాతానికిపైగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 9 శాతం పెరగడం విశేషం. ఇందులో ముఖ్యంగా కిరాణా, ఫ్యాషన్, యుటిలిటీ పేమెంట్, బీమా ప్రీమియం చెల్లింపులు, ఆన్‌లైన్ విద్య చెల్లింపులు కీలకంగా ఉన్నాయని ఆయన వివరించారు. ప్రజల కొనుగోళ్లను బట్టి డిజిటల్ చెల్లింపులు ఎంతమేతకు పెరుగుతాయనేది చెప్పాలేమని ఆయన వెల్లడించారు.