SBI : గృహరుణాలపై వడ్డీ తగ్గింపు
దిశ, వెబ్‌డెస్క్ : విజయదశమి పండుగ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) కస్టమర్లకు తీపికబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ ఆఫర్ రూ.75లక్షల పైబడిన రుణాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. SBI యోనో యాప్ ద్వారా అప్లికేషన్ చేయడంతో పాటు వినియోగదారుడి సిబిల్ స్కోర్ సంతృప్తి కరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం రూ.30లక్షల వరకున్న గృహ రుణాలపై ఏడాదికి 6.9శాతం […]
దిశ, వెబ్‌డెస్క్ : విజయదశమి పండుగ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) కస్టమర్లకు తీపికబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ ఆఫర్ రూ.75లక్షల పైబడిన రుణాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. SBI యోనో యాప్ ద్వారా అప్లికేషన్ చేయడంతో పాటు వినియోగదారుడి సిబిల్ స్కోర్ సంతృప్తి కరంగా ఉండాలని సూచించింది.
ప్రస్తుతం రూ.30లక్షల వరకున్న గృహ రుణాలపై ఏడాదికి 6.9శాతం వడ్డీని, అంతకు మించి ఉన్న రుణాలపై 7శాతం వడ్డీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేస్తోంది.