ఎంఐఎంకు భారీ షాక్

దిశ , పెద్దపల్లి: ఎంఐఎం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సయ్యద్ మస్రత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీకి పంపించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఐఎం పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకత్వ లేమి సమస్య తీవ్రంగా ఉండటం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడం, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడం, కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించకపోవడం, కనీసం […]

Update: 2021-08-03 04:19 GMT

దిశ , పెద్దపల్లి: ఎంఐఎం పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సయ్యద్ మస్రత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీకి పంపించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఐఎం పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకత్వ లేమి సమస్య తీవ్రంగా ఉండటం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడం, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకపోవడం, కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించకపోవడం, కనీసం ఫోన్ ఎత్తకపోవడం వంటివి కారణాలు కొట్టొచ్చినట్లు కన్పించాయని, ముస్లిం మైనారిటీలు మెజార్టీగా ఉన్న ఎంఐఎం పార్టీలో పనిచేసే నాయకులకు గుర్తింపు లేకపోవడం, మైనార్టీల సమస్యలపై శీతకన్ను ప్రదర్శించడం వంటివి తీవ్రంగా బాధించాయని మస్రత్ వెల్లడించారు.

హైదరాబాద్‌కే పరిమితమైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. పెడచెవిన పెట్టడం, పట్టించుకోకపోవడం, జిల్లాల పార్టీ నిర్మాణం వైపు, సంస్థాగత బలోపేతం వైపు దృష్టి పెట్టకపోవడం, ఇటువంటి పార్టీలో కొనసాగడం వృథా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, ఏ పార్టీలో చేరేది వివరాలు వెల్లడిస్తానని అన్నారు.

Tags:    

Similar News