అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ మామ
దిశ, చింతలపాలెం: ప్రస్తుత రాజకీయాలు సామాజికంగా కులాల వారీగా నడుస్తున్నాయి. గ్రామాభివృద్ధి కోసం మామ మీద నమ్మకంతో కొడలును ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా వారికి అన్ని విధులుగా తోడ్పడుతూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు సర్పంచ్ మామ పప్పు జాన్. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలంలోని కిష్టాపురంలో గత స్థానిక సంస్థల ఎన్నికలలో పప్పు జాన్ కోడలు బురాన్ బీ జానీపాషాను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన […]
దిశ, చింతలపాలెం: ప్రస్తుత రాజకీయాలు సామాజికంగా కులాల వారీగా నడుస్తున్నాయి. గ్రామాభివృద్ధి కోసం మామ మీద నమ్మకంతో కొడలును ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా వారికి అన్ని విధులుగా తోడ్పడుతూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు సర్పంచ్ మామ పప్పు జాన్. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలంలోని కిష్టాపురంలో గత స్థానిక సంస్థల ఎన్నికలలో పప్పు జాన్ కోడలు బురాన్ బీ జానీపాషాను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన మీద నమ్మకంతో తన కోడలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో గ్రామ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మహిళలకు అండగా నిలుస్తున్నారు. తాను ముస్లిం అయినప్పటికీ అన్ని మతాలను సమానంగా గుర్తిస్తున్నారు. గతంలో బతుకమ్మ పండుగ సందర్బంగా ఆ గ్రామంలోని హిందూ మహిళలకు తన సొంత ఖర్చులతో లక్ష రూపాయలు వెచ్చించి 120 మందికి చీరలను పంపిణీ చేశారు. అలాగే క్రిస్మస్ పండుగ సందర్బంగా శుక్రవారం క్రైస్తవ మహిళలకు 60 వేల రూపాయలతో 95 చీరలను పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రజలంతా ఒక్కటేనని కుల, మత వర్గాలకు ఇక్కడ స్థానం లేదంటూ గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పప్పు జాన్. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చింతరెడ్డి చంద్రకళ, సర్పంచ్ బూరాన్ బీ, జానిపాషా, వార్డు సభ్యులు రాజ్యం, మోషా, సలోమాన్, ఆరోన్, చిన్న బుజ్జి, ఆలె సైదా, తదితరులు పాల్గొన్నారు.