టెక్నికల్ అసిస్టెంట్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సర్పంచ్

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజుపై పాతసావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రాజు గట్టిగా కేకలు వేస్తూ.. అరిచాడు. దీంతో సిబ్బంది మొత్తం ప్రమాద ఘటనకు వచ్చి రాజును కుబీర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. […]

Update: 2021-07-13 08:05 GMT

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజుపై పాతసావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రాజు గట్టిగా కేకలు వేస్తూ.. అరిచాడు. దీంతో సిబ్బంది మొత్తం ప్రమాద ఘటనకు వచ్చి రాజును కుబీర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. కుబీర్ గ్రామంలో గ్రావెల్ వర్క్స్ విషయంలో మాస్టర్‌పై సంతకం చేయాలని సర్పంచ్ సాయినాథ్ రాజును అడిగాడు. దీంతో రాజు నిరాకరించాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ రాజుపై పెట్రోల్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News