గ్రామస్తుల కోసం కరోనా మాస్క్‌లు కుట్టిన సర్పంచ్

దిశ, మెదక్: కరోనా ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కొనుకుందామన్నా మాస్క్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తుల ఆరోగ్యం కోసం ఓ మహిళా సర్పంచ్ రంగంలోకి దిగారు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం షాపూర్ సర్పంచ్ సంపూర్ణా బాయి మారుతి స్వయంగా తానే మాస్క్‌లను తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో గ్రామస్తులంతా మాస్క్‌లు ధరించాలని ఆమె […]

Update: 2020-04-10 04:22 GMT

దిశ, మెదక్: కరోనా ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు. అయితే, ప్రస్తుతం కొనుకుందామన్నా మాస్క్‌లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తుల ఆరోగ్యం కోసం ఓ మహిళా సర్పంచ్ రంగంలోకి దిగారు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం షాపూర్ సర్పంచ్ సంపూర్ణా బాయి మారుతి స్వయంగా తానే మాస్క్‌లను తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో గ్రామస్తులంతా మాస్క్‌లు ధరించాలని ఆమె సూచించారు. కాగా, గ్రామస్తుల కోసం తానే స్వయంగా మాస్క్‌లను తయారు చేసిన ఈ సర్పంచ్‌ సంపూర్ణా బాయి మారుతి ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.

Tags: Sarpanch, pierced, corona masks, villagers, sangareddy

Tags:    

Similar News