సర్పంచ్‌ను కాపాడుతారా… చర్యలు తీసుకుంటారా?
దిశ, సూర్యపేట: గ్రామపంచాయతీలో హరితహారం మొక్కలకు నీరు పోయాల్సిన ట్రాక్టర్‌తో సర్పంచ్ తన ఇంట్లో మొక్కలకు నీరు పోస్తున్న సంఘటన మంగళవారం చివ్వెంల మోదీనిపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ జనార్దనరెడ్డి ఇటీవల తన 20 ఎకరాల వెంచర్‌కు ఎర్రచందనం మొక్కలు కొనుగోలు చేశాడు. ఆ మొక్కలకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను పెట్టి నీటిని పొయిస్తున్నాడు. గ్రామ పంచాయతీలో నాటిన మొక్కలకు నీరు పోయాల్సిన టాక్టర్‌ను తన సొంత పొలంలో నీరును పోసేందుకు […]
దిశ, సూర్యపేట: గ్రామపంచాయతీలో హరితహారం మొక్కలకు నీరు పోయాల్సిన ట్రాక్టర్‌తో సర్పంచ్ తన ఇంట్లో మొక్కలకు నీరు పోస్తున్న సంఘటన మంగళవారం చివ్వెంల మోదీనిపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామ సర్పంచ్ జనార్దనరెడ్డి ఇటీవల తన 20 ఎకరాల వెంచర్‌కు ఎర్రచందనం మొక్కలు కొనుగోలు చేశాడు. ఆ మొక్కలకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను పెట్టి నీటిని పొయిస్తున్నాడు. గ్రామ పంచాయతీలో నాటిన మొక్కలకు నీరు పోయాల్సిన టాక్టర్‌ను తన సొంత పొలంలో నీరును పోసేందుకు ఉపయోగిస్తున్నాడు. గతంలో వట్టిఖమ్మంపహాడ్ సర్పంచ్ కూడా చేపలు పట్టేందుకు హరితహారంలో మొక్కలకు నీరు పోయాల్సి ట్రాక్టర్‌ను ఇలాగే సొంత పనులకు ఉపయోగించిన విషయం తెలిసిందే. అప్పుడు అధికారులు నామమాత్రంగా విచారణ జరిపి సర్పంచ్ కార్యదర్శులను కాపాడారు. మరి ఇప్పుడు ఈ సర్పంచ్‌ను కూడా కాపాడతారా..? లేకపోతే చర్యలు తీసుకుంటారా..? ఎదురుచూడాల్సిందేనని గ్రామస్తులు అంటున్నారు.