TRS మంత్రులు తల ఎక్కడ పెట్టుకుంటారు.. సర్దార్ రవిందర్ సింగ్ ఫైర్

దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని తనకు అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులకు ధన్యావాదాలు తెలుపుతున్నానని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, టీఆర్ఎస్ కు ఉన్న 986 ఓట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ పై మంత్రులు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు వెంటనే […]

Update: 2021-12-14 01:04 GMT

దిశ, కరీంనగర్ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని తనకు అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులకు ధన్యావాదాలు తెలుపుతున్నానని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, టీఆర్ఎస్ కు ఉన్న 986 ఓట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ పై మంత్రులు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.

జిల్లా మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనకు మరో 32 ఓట్లు వస్తే సెకండ్ ప్రయారిటీ ఓట్లతో తాను మండలికి ఎన్నికయ్యేవాడినని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా వేసిన ఓటర్లు తనకు రెండో ప్రాధాన్యత ఓట్లు వేశారన్నారు. అయితే పోలింగ్‌లో ఓట్లు ఎలా వేయాలి అన్న విషయంపై ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తనకు మద్దతు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రవిందర్ సింగ్ థాంక్స్ చెప్పారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం మాత్రం తనదేనని రవిందర్ సింగ్ స్పష్టం చేశారు.

‘సర్దార్’ సినిమా చూపించాడు .. మరో 32 వచ్చుంటే..

 

Tags:    

Similar News