నేను చేసిన తప్పు అదే: సంజయ్ ఝా

న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు ఉద్వాసన పలకడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. ఝాను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం లెటర్ పంపింది. దీనిపై స్పందిస్తూ సంజయ్ ఝా తీవ్ర విమర్శలు చేశారు. తన విధేయత కాంగ్రెస్ భావజాలానికేనని గానీ, మరే వ్యక్తికో, కుటుంబానికో కాదని స్పష్టం చేశారు. గాంధీ-నెహ్రూవియన్ ఆదర్శాలనే పాటిస్తానని, ఈ ఆదర్శాలు ప్రస్తుతం పార్టీలో కనుమరుగవుతున్నాయని తెలిపారు. పార్టీ మళ్లీ పునరుత్తేజం గావించడానికి తాను పోరాడుతూనే ఉంటారని […]

Update: 2020-07-15 08:51 GMT

న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు ఉద్వాసన పలకడంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝాపై ఆ పార్టీ వేటువేసింది. ఝాను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం లెటర్ పంపింది. దీనిపై స్పందిస్తూ సంజయ్ ఝా తీవ్ర విమర్శలు చేశారు. తన విధేయత కాంగ్రెస్ భావజాలానికేనని గానీ, మరే వ్యక్తికో, కుటుంబానికో కాదని స్పష్టం చేశారు. గాంధీ-నెహ్రూవియన్ ఆదర్శాలనే పాటిస్తానని, ఈ ఆదర్శాలు ప్రస్తుతం పార్టీలో కనుమరుగవుతున్నాయని తెలిపారు. పార్టీ మళ్లీ పునరుత్తేజం గావించడానికి తాను పోరాడుతూనే ఉంటారని వివరించారు. ఈ పోరాటం ఇప్పుడే మొదలైందని పేర్కొన్నారు. అంతేకాదు, తనలో కాంగ్రెస్సీ డీఎన్ఏ ఉన్నదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పోరాడటం, పార్టీని సంస్కరించడానికి రిప్‌వాన్ వింకిల్ నాయకత్వానికి సలహాలివ్వడమే తాను చేసిన తప్పులని వ్యగ్యంగా తన ట్విట్టర్‌ బయోలో రాసుకున్నారు.

Tags:    

Similar News