శానిటైజర్ మేడ్ బై ఆర్టీసీ
దిశ, కరీంనగర్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అత్యంత కీలకమైనది శానిటైజర్ వినియోగం. ఒకవేళ వైరస్ చైతులపై పడ్డా అది శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు తరచూ శానిటైజ్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ యూజ్ చేయడం ఇప్పుడు కంపల్సరీ. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికులకూ మరీ ముఖ్యం శానిటైజర్. ఎందుకంటే ప్రయాణికులు బస్సుల్లో రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు జనసమ్మర్థం […]
దిశ, కరీంనగర్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అత్యంత కీలకమైనది శానిటైజర్ వినియోగం. ఒకవేళ వైరస్ చైతులపై పడ్డా అది శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు తరచూ శానిటైజ్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ యూజ్ చేయడం ఇప్పుడు కంపల్సరీ. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికులకూ మరీ ముఖ్యం శానిటైజర్. ఎందుకంటే ప్రయాణికులు బస్సుల్లో రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న వారిలో ఎవరో ఒకర్నుంచి వైరస్ సోకే ప్రమాదముంది. అప్పుడు సిబ్బంది తరచూ శానిటైజ్ చేసుకుంటే ప్రమాదం అరికట్టొచ్చు. అయితే, శానిటైజర్ బాటిళ్లు కొనుగోలు చేయడం ఇప్పుడు సంస్థకు ఆర్థిక భారం కానుంది. అధికారులు ఆ భారం తగ్గించేందుకు వినూత్న ఆలోచన చేశారు. శానిటైజర్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కొనుగోలు చేసి వాటిని డిపోల వారీగా అందుబాటులో ఉంచుతున్నారు.
లాక్ డౌన్‌కు ముందు నుంచే..
ప్రభుత్వం లాక్ డౌన్ విధించడాని కంటె ముందే ఆర్టీసీ మెయింటనెన్స్ వింగ్ శానిటైజర్ తయారీపై దృష్టి పెట్టింది. శానిటైజర్ తయారుచేసి కార్మికులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే, లాక్ డౌన్‌తో ఆర్టీసీని ప్రభుత్వం నిలిపేయడంతో శానిటైజర్ తయారీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ప్రభుత్వం బస్సులు నడపాలని నిర్ణయించడంతో మళ్లీ శానిటైజర్ తయారు చేసి కార్మికులకు అందుబాటులో ఉంచుతున్నారు. డిపోల వద్ద శానిటైజర్ ట్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులు డ్యూటీకి వెళ్లేప్పుడు హ్యాండ్ స్ప్రే బాటిల్ ఇస్తున్నారు. దాంతో కార్మికులు చేతులు శానిటైజ్ చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. 10 లీటర్ల శానిటైజర్ తయారీకి రూ.8,500 ఖర్చవుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఖర్చు ఆదా…
వందల సంఖ్యలో ఉండే ఆర్టీసీ కార్మికులకు రిటేల్ మార్కెట్‌లో శానిటైజర్ బాటిల్స్ కొనుగోలు చేస్తే అడ్డగోలు ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ముడి సరుకులు కొనుగోలు చేయడం వల్ల సగానికి సగం డబ్బు ఆదా అవుతోంది,. కార్మికుల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు శానిటైజర్ సిద్ధం చేస్తున్నాం.
– మెయింటనెన్స్ వింగ్ అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి.