ఈదురు గాలుల బీభత్సం.. రేకులు పడి మహిళ మృతి
దిశ, కరీంనగర్: ఈదురు గాలులకు ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరి మీద పడటంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ తండాకు చెందిన బట్టు రాజవ్వ (46) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసేవారు. వీరు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించారు. టోకెన్ నంబర్ రాకపోవడంతో అక్కడే ధాన్యం ఆరబోశారు. బుధవారం ఈదురుగాలులు వీస్తుండటంతో వర్షం పడే అవకాశం ఉందని భావించిన రాజవ్వ, భర్తతో కలిసి ధాన్యం కొనుగోలు […]
దిశ, కరీంనగర్: ఈదురు గాలులకు ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరి మీద పడటంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ తండాకు చెందిన బట్టు రాజవ్వ (46) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసేవారు. వీరు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించారు. టోకెన్ నంబర్ రాకపోవడంతో అక్కడే ధాన్యం ఆరబోశారు. బుధవారం ఈదురుగాలులు వీస్తుండటంతో వర్షం పడే అవకాశం ఉందని భావించిన రాజవ్వ, భర్తతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్తుండగా ఓ ఇంటిపైన ఉన్న రేకులు ఎగిరి ఆమెపై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన రాజవ్వను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందారు.
Tags: Karimnagar, A sanitary worker worker, death