Sania Mirza : దయచేసి నా కొడుక్కు కూడా వీసా ఇప్పించండి – సానియా మీర్జా

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు వ్యక్తిగత సమస్య ఎదురైంది. ఇంగ్లాండ్ లో జూన్ 6 న జరగబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తో పాటు మరికొన్ని టెన్నిస్ టోర్నీలలో సానియా పాల్గొననున్నది.  ఇంగ్లాండ్ వెళ్ళడానికి సానియాకు వీసా కూడా మంజూరయ్యింది. అయితే సానియా మాత్రం తన రెండేళ్ల కుమారుడు  ఇజ్‌హాన్‌కు, సహాయకురాలికి కూడా వీసా ఇవ్వాలంటూ ఇంగ్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి ఇంగ్లాండ్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. కరోనా కేసులు […]

Update: 2021-05-20 02:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు వ్యక్తిగత సమస్య ఎదురైంది. ఇంగ్లాండ్ లో జూన్ 6 న జరగబోయే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తో పాటు మరికొన్ని టెన్నిస్ టోర్నీలలో సానియా పాల్గొననున్నది. ఇంగ్లాండ్ వెళ్ళడానికి సానియాకు వీసా కూడా మంజూరయ్యింది. అయితే సానియా మాత్రం తన రెండేళ్ల కుమారుడు ఇజ్‌హాన్‌కు, సహాయకురాలికి కూడా వీసా ఇవ్వాలంటూ ఇంగ్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి ఇంగ్లాండ్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశం నుండి వచ్చే వారికి పర్మిషన్ లేదని స్పష్టం చేసింది.

టోర్నీలు కారణంగా తాను నెల రోజులకు పైగా ఇంగ్లాండ్ లోనే గడపాల్సి ఉందని, అప్పటివరకు తన రెండేళ్ల కుమారుడుని వదిలిఉండడం కష్టమని సానియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి సానియా లేఖ రాసింది. ఇక సానియా లేఖపై స్పందించిన ప్రభుత్వం సానియా కుమారుడికి వీసా ఇప్పించే అంశంపై ఇంగ్లండ్‌తో కేంద్ర విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News