సంగారెడ్డి డిఎస్పీ ఫేస్ బుక్ హ్యాక్

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు ఆదివారం తన పేరుతో ఫేస్ బుక్ నకిలీ ఖాతాను సృష్టించారని, ఈ విషయాన్ని స్నేహితులు గుర్తించి సమాచారం ఇచ్చారని సంగారెడ్డి డిఎస్పీ పీ.శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన స్నేహితులతో చాటింగ్ చేసి… అత్యవసరంగా డబ్బు కావాలంటూ కోరినట్లు ఆయన తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు, తన సోదరుడు అది నకిలీ ఖాతాగా భావించి తన దృష్టికి తేవడంతో వెంటనే ఖాతాను తొలిగించామని తెలిపారు. ఫేస్ బుక్ లో పరిచయం లేని […]

Update: 2020-09-27 23:45 GMT

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు ఆదివారం తన పేరుతో ఫేస్ బుక్ నకిలీ ఖాతాను సృష్టించారని, ఈ విషయాన్ని స్నేహితులు గుర్తించి సమాచారం ఇచ్చారని సంగారెడ్డి డిఎస్పీ పీ.శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన స్నేహితులతో చాటింగ్ చేసి… అత్యవసరంగా డబ్బు కావాలంటూ కోరినట్లు ఆయన తెలిపారు.

దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు, తన సోదరుడు అది నకిలీ ఖాతాగా భావించి తన దృష్టికి తేవడంతో వెంటనే ఖాతాను తొలిగించామని తెలిపారు. ఫేస్ బుక్ లో పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు, చాటింగ్ లకు స్పందించకూడదన్నారు. స్నేహితులను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు తన ఫోటోను వాడుకున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News