కేంద్రంతో చర్చలకు కమిటీని ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా..

దిశ, న్యూఢిల్లీ: కేంద్రంతో జరిగే సమావేశానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రైతు సంఘాలు ప్రకటించాయి. భవిష్యత్ కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కిసాన్ మోర్చా శనివారం సింఘూ సరిహద్దుల్లో సమావేశమయ్యారు. బల్బీర్ సింగ్ రాజేవల్, అశోక్ దవ్లే, శివ్ కుమార్ కక్కా, గుర్నాం సింగ్ చాదునీ, యుద్వీర్ సింగ్ కమిటీలో రైతు నాయకులని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. పార్లమెంటులో సాగు చట్టాల రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రంతో […]

Update: 2021-12-04 09:38 GMT

దిశ, న్యూఢిల్లీ: కేంద్రంతో జరిగే సమావేశానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రైతు సంఘాలు ప్రకటించాయి. భవిష్యత్ కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కిసాన్ మోర్చా శనివారం సింఘూ సరిహద్దుల్లో సమావేశమయ్యారు. బల్బీర్ సింగ్ రాజేవల్, అశోక్ దవ్లే, శివ్ కుమార్ కక్కా, గుర్నాం సింగ్ చాదునీ, యుద్వీర్ సింగ్ కమిటీలో రైతు నాయకులని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. పార్లమెంటులో సాగు చట్టాల రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్రంతో చర్చలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు శనివారం వెల్లడించింది. కనీస మద్దతు ధరతో పాటు చనిపోయిన రైతులకు పరహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ అన్నారు.

అంతేకాకుండా తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. వచ్చే మంగళవారం మోర్చా తదుపరి కార్యచరణకోసం సమావేశం కానున్నట్లు తెలిపారు. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే సింఘూ సరిహద్దు నుంచి కదిలే ప్రసక్తి లేదని నొక్కి చెప్పారు. లఖీంపూర్ ఘటనలో రైతులపై తప్పుడు కేసుల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కాగా సోమవారమే కేంద్రం పార్లమెంటులో సాగు చట్టాలను రద్దు తీర్మానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News