స్థానిక ఆర్అండ్‌డీపై దృష్టి సారించనున్న శామ్‌సంగ్!

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 25 ఏండ్ల కార్యకలాపాలను పూర్తి చేసిన సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ దేశీయంగా స్థానిక ఆర్ అండ్ డీపై దృష్టి సారించి, తయారీలో మరింత అభివృద్ధిని తీసుకురానున్నట్టు బుధవారం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 73 వేల కోట్ల ఆదాయాన్ని సాధించిన శాంసంగ్ భారత్‌లో తయారీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కొత్త కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ #PoweringDigitalIndia […]

Update: 2020-12-09 09:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 25 ఏండ్ల కార్యకలాపాలను పూర్తి చేసిన సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ దేశీయంగా స్థానిక ఆర్ అండ్ డీపై దృష్టి సారించి, తయారీలో మరింత అభివృద్ధిని తీసుకురానున్నట్టు బుధవారం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 73 వేల కోట్ల ఆదాయాన్ని సాధించిన శాంసంగ్ భారత్‌లో తయారీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కొత్త కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించింది.

ఈ సందర్భంగా సంస్థ #PoweringDigitalIndia హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా స్థానిక స్టార్టప్ కమ్యూనిటీపై ప్రత్యేక దృష్టి సారించి, తయారీలో కొత్త విధానాలను తీసుకొస్తామని శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము 1995లో కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు ఆదాయం కేవలం రూ. 44 కోట్లుగా ఉందని, అది నేడు రూ. 73 వేల కోట్లకు ఎదిగిందని, ఈ డిసెంబర్‌తో కంపెనీ 25 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం గర్వంగా ఉందని శాంసంగ్ తెలిపింది. భారత్ భవిష్యత్తు వృద్ధికి శాంసంగ్ సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తుందని, భారత్‌తో బలమైన భాగస్వామిగా ఉంటుందని శాంసంగ్ ఆసియా ప్రెసిడెంట్ కెన్ కాంగ్ చెప్పారు.

Tags:    

Similar News