సమంత గొప్ప మనస్సు.. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు బహుకరణ
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రముఖ సినీనటి, నాగార్జున కోడలు సమంత దిశ ఫౌండేషన్ ద్వారా పది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ప్రత్యూష ఫౌండేషన్ సహాకారంతో అందించారు. రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా పేషెంట్‌లకు ఇబ్బందులు కలగకుండా తగిన సహాయ సహకారాలు అందజేయడానికి […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రముఖ సినీనటి, నాగార్జున కోడలు సమంత దిశ ఫౌండేషన్ ద్వారా పది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ప్రత్యూష ఫౌండేషన్ సహాకారంతో అందించారు. రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కొరత వల్ల కరోనా పేషెంట్‌లకు ఇబ్బందులు కలగకుండా తగిన సహాయ సహకారాలు అందజేయడానికి పలువురు ప్రముఖులు, ఎన్నారైలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
కరోనా పేషెంట్ లకు 24 గంటలు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా దిశ సామాజిక సేవా సంస్థ నిర్వాహకురాలు సినీ యాక్టర్ సమంతకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి వినియోగంలోకి తెస్తామని మంత్రి చెప్పారు. దిశ సంస్థ అందించిన 10 ఆక్సిజన్ కన్సెంట్రేటర్లను, ఎం ఎస్ ఎమ్ లేబరేటరీ ద్వారా అందిన 2 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను దేవరకద్ర, బాలానగర్, రాజాపూర్, సీసీ కుంట లాల్ లో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ సెంటర్లలో ఉంచి వినియోగంలోకి తెస్తామని మంత్రి చెప్పారు.