‘ఫ్రెష్’ బిజినెస్‌తో సల్మాన్ ఖుష్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇప్పటికే ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో క్లాత్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న విషయం తెలిసిందే. కరోనా టైమ్‌లో కొత్తగా ఆలోచించిన సల్మాన్.. ‘ఫ్రెష్’గా మరో బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘అత్యుత్తమ ఉత్పత్తులు నీకు, నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని తెలుపుతూ రహో ఫ్రెష్.. రహో సేఫ్’ అని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయానికి తగ్గట్టుగా.. […]

Update: 2020-05-25 04:59 GMT

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇప్పటికే ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో క్లాత్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న విషయం తెలిసిందే. కరోనా టైమ్‌లో కొత్తగా ఆలోచించిన సల్మాన్.. ‘ఫ్రెష్’గా మరో బిజినెస్‌ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆదివారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘అత్యుత్తమ ఉత్పత్తులు నీకు, నాకు మనందరికీ అందుబాటులోకి వచ్చేశాయని తెలుపుతూ రహో ఫ్రెష్.. రహో సేఫ్’ అని పేర్కొన్నారు.

ఈ సంక్షోభ సమయానికి తగ్గట్టుగా.. శానిటైజర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సల్లూ భాయ్. ‘‘ఫ్రెష్’’ పేరుతో సరికొత్త హ్యాండ్ శానిటైజర్‌ను ఆదివారం లాంచ్ చేశారు. ‘లాంచింగ్ మై న్యూ గ్రూమింగ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్ ఫ్రెష్’ అంటూ ట్విట్టర్ వేదికగా న్యూస్ షేర్ చేశారు. ‘ముందుగా ఇదే పేరుతో డియోడరెంట్లను తీసుకురావాలని అనుకున్నాం, కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శానిటైజర్ల తీసుకొచ్చాం’ ఆయన చెప్పారు. తరువాతి కాలంలో డియోడరెంట్స్, బాడీ వైప్స్, పర్‌ఫ్యూమ్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా తమ కొత్త బ్రాండ్ కింద విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రెష్ వరల్డ్.కామ్(frshworld.com)లో ఇవి లభిస్తాయని, మరికొద్ది రోజుల్లో స్టోర్స్‌లోనూ అందుబాటులోకి వస్తాయని సల్మాన్ తెలిపారు.

Tags:    

Similar News