అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుంచి సాయిబాబా తొలగింపు

న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబాను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఢిల్లీ వర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కళాశాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య వసంత వెల్లడించారు. ఈ మేరకు రామ్ లాల్ ఆనంద్ కళాశాల ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ పేరిట గురువారం తమకు లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ నిర్ణయం మార్చి 31 నుంచి అమలులోకి వస్తుందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. అంతేగాకుడా.. మూడు నెలల జీతాన్ని సాయిబాబా […]

Update: 2021-04-02 22:03 GMT

న్యూఢిల్లీ: అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయిబాబాను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఢిల్లీ వర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కళాశాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య వసంత వెల్లడించారు. ఈ మేరకు రామ్ లాల్ ఆనంద్ కళాశాల ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ పేరిట గురువారం తమకు లేఖ వచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ నిర్ణయం మార్చి 31 నుంచి అమలులోకి వస్తుందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. అంతేగాకుడా.. మూడు నెలల జీతాన్ని సాయిబాబా అకౌంట్‌లో జమ చేశారని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంపై ఆమె మండిపడ్డారు. కళాశాల నిర్ణయాన్ని కోర్డులో సవాల్ చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఆయనకు 2017లో జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News