అమెరికా జట్టులో సఫారీ క్రికెటర్ !

ఏ క్రికెటరైనా ఐసీసీ టెస్టు హోదా ఉన్న జట్టులో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ, జాతీయ జట్టు తరఫున 9 టెస్టులు ఆడిన ఓ క్రికెటర్ మాత్రం అద్భుతమైన కెరీర్‌ను వదిలేసి.. క్రికెట్‌లో అనామక దేశమైన అమెరికాకు వెళ్లిపోయాడు. అతనే సఫారీ జట్టు స్పిన్నర్ ‘డేన్ పైడ్’. దక్షిణాఫ్రికా జట్టు సభ్యుడైన పైడ్.. ఆ జట్టుకు టాటా చెప్పేసి అమెరికా జాతీయ జట్టులో చేరేందుకు వెళ్లిపోయాడు. అంతేకాకుండా, అమెరికాలో జరిగే సరికొత్త టీ20 లీగ్‌లోనూ అతను పాలుపంచుకోనున్నట్లు […]

Update: 2020-03-28 04:42 GMT

ఏ క్రికెటరైనా ఐసీసీ టెస్టు హోదా ఉన్న జట్టులో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ, జాతీయ జట్టు తరఫున 9 టెస్టులు ఆడిన ఓ క్రికెటర్ మాత్రం అద్భుతమైన కెరీర్‌ను వదిలేసి.. క్రికెట్‌లో అనామక దేశమైన అమెరికాకు వెళ్లిపోయాడు. అతనే సఫారీ జట్టు స్పిన్నర్ ‘డేన్ పైడ్’. దక్షిణాఫ్రికా జట్టు సభ్యుడైన పైడ్.. ఆ జట్టుకు టాటా చెప్పేసి అమెరికా జాతీయ జట్టులో చేరేందుకు వెళ్లిపోయాడు. అంతేకాకుండా, అమెరికాలో జరిగే సరికొత్త టీ20 లీగ్‌లోనూ అతను పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఒక క్రీడావార్తల వెబ్‌సైట్ అతడిని సంప్రదించగా.. సఫారీ జట్టుకు గుడ్ బై చెప్పిన విషయాన్ని ధృవీకరించాడు.

పైగా అమెరికా అనామక జట్టేమీ కాదని.. ఆ దేశానికి వన్డే గుర్తింపు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు అమెరికాను ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చూస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే దక్షిణాఫ్రికా జట్టులో సరైన అవకాశాలు రాకపోవడంతోనే పైడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags : Southafrica, Cricketer, America, oneday Cricket, Dane Piedt

Tags:    

Similar News