560 చిన్నారులకు అండగా నిలిచిన సచిన్..!
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్న సచిన్.. నిజజీవితంలో కూడా దేవుడని నిరూపించుకున్నాడు. తాజాగా పోషకాహార లోపం, నిర్లక్యరాస్యతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు వచ్చాడు. ఎన్జీవో సంస్థ అయిన పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 చిన్నారులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జల్లాలోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్‌లోని గిరిజన చిన్నారులకు టెండూల్కర్ […]
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్న సచిన్.. నిజజీవితంలో కూడా దేవుడని నిరూపించుకున్నాడు. తాజాగా పోషకాహార లోపం, నిర్లక్యరాస్యతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు వచ్చాడు. ఎన్జీవో సంస్థ అయిన పరివార్‌తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 చిన్నారులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జల్లాలోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్‌లోని గిరిజన చిన్నారులకు టెండూల్కర్ ఫౌండేషన్ పోషకాహారం, విద్యను అందించనుంది. అట్టడుగు వర్గాలకు చెందిన చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Read Also…