సచిన్ ఏడవటం అప్పుడే చూశా : సౌరవ్
దిశ, స్పోర్ట్స్ : లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇండ్లకే పరిమితమైన క్రికెటర్లందరూ సామాజిక మాధ్యమాల్లో తమ అనుభవాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా తన పాత రోజులను నెమరేసుకున్నాడు. ఇదే క్రమంలో సచిన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘సచిన్ టెండూల్కర్‌కు సహనం ఎక్కువని, అతడు తన కెరీర్‌లో మైదానంలో గానీ లేదా బయటగానీ ఎప్పుడూ సహనం కోల్పోలేదని’ గంగూలీ చెప్పాడు. కానీ 1997 వెస్టిండీస్ పర్యటనలో టెస్టు […]
దిశ, స్పోర్ట్స్ : లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇండ్లకే పరిమితమైన క్రికెటర్లందరూ సామాజిక మాధ్యమాల్లో తమ అనుభవాలను గుర్తు తెచ్చుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా తన పాత రోజులను నెమరేసుకున్నాడు. ఇదే క్రమంలో సచిన్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘సచిన్ టెండూల్కర్‌కు సహనం ఎక్కువని, అతడు తన కెరీర్‌లో మైదానంలో గానీ లేదా బయటగానీ ఎప్పుడూ సహనం కోల్పోలేదని’ గంగూలీ చెప్పాడు. కానీ 1997 వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఓడిపోయిన రోజున మాత్రం సచిన్.. డ్రెస్సింగ్ రూములోకి వచ్చి భోరున విలపించాడని’ తెలిపాడు.
‘భారత జట్టు ఆ సీరీస్‌ను 0-1 తేడాతో ఓడిపోయింది. మూడో టెస్టులో గెలిచేందుకు 120 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ, భారత జట్టు కేవలం 81 పరుగులకే ఆలౌట్ కావడంతో 11 ఏళ్ల తర్వాత విండీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. అప్పుడు జట్టుకు కెప్టెన్ సచిన్ టెండూల్కరే. కాగా, ‘ఆ సమయంలో అతడి పక్కన ఉన్న నాపై కూడా చాలా కోప్పడ్డాడు. రేపటి నుంచి తనతో పాటు మైదానంలో రన్నింగ్ చేయాలని ఆదేశించాడు’ అని గంగూలీ అప్పటి సంగతులను గుర్తుచేసుకున్నాడు.
Tags : Sachin Tendulkar, Sourav Ganguly, Test Series, BCCI, Cricket, West Indies, Sachin Cried