శ్రీశాంత్ కోసం ఏడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నా: సచిన్ బేబీ
దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ తిరిగి రంజీల్లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్‌లో శ్రీశాంత్‌ను కేరళ రంజీ జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమే. ఈ విషయంపై కేరళ రంజీ ఆటగాడు సచిన్ బేబీ స్పందించాడు. శ్రీశాంత్ రాక కోసం ఏడేండ్ల నుంచి ఎదురు చూస్తున్నానని, అతడు జట్టకు ఎంతో ఉపయోగపడతాడని అన్నాడు. ఒక ఇన్‌స్టా లైవ్‌లో సచిన్ బేబీ మాట్లాడుతూ ‘నాకు శ్రీశాంత్ సోదరుడి లాంటివాడు. […]
దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ తిరిగి రంజీల్లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్‌లో శ్రీశాంత్‌ను కేరళ రంజీ జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమే. ఈ విషయంపై కేరళ రంజీ ఆటగాడు సచిన్ బేబీ స్పందించాడు. శ్రీశాంత్ రాక కోసం ఏడేండ్ల నుంచి ఎదురు చూస్తున్నానని, అతడు జట్టకు ఎంతో ఉపయోగపడతాడని అన్నాడు. ఒక ఇన్‌స్టా లైవ్‌లో సచిన్ బేబీ మాట్లాడుతూ ‘నాకు శ్రీశాంత్ సోదరుడి లాంటివాడు. మా జట్టులోని వాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ చాలా ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని అన్నాడు. గత కొన్నాళ్లుగా శ్రీశాంత్‌తో కలసి సచిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను నెట్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ఫిట్‌నెస్‌పై కూడా శ్రద్ధ చూపితే మళ్లీ మనం మునుపటి శ్రీశాంత్‌ను చూడొచ్చని సచిన్ వెల్లడించాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడు కావడం విశేషం.