రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని అరెస్ట్ చేశారు పోలీసులు. జర్మనీ నుంచి మాస్కోలోని షెరెమెటివో ఎయిర్‌పోర్టుకు వచ్చిన వెంటనే.. ఆయనను రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో నవాల్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఐదు నెలల క్రితం నవాల్నీ విమానంలో ప్రయాణిస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం జర్మనీకి తరలించారు. నరాలను ప్రభావితం చేసే విష ప్రయోగం త‌న‌పై జ‌రిగింద‌ని నవాల్నీ చెప్పుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ […]

Update: 2021-01-18 01:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీని అరెస్ట్ చేశారు పోలీసులు. జర్మనీ నుంచి మాస్కోలోని షెరెమెటివో ఎయిర్‌పోర్టుకు వచ్చిన వెంటనే.. ఆయనను రష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో నవాల్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఐదు నెలల క్రితం నవాల్నీ విమానంలో ప్రయాణిస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం జర్మనీకి తరలించారు. నరాలను ప్రభావితం చేసే విష ప్రయోగం త‌న‌పై జ‌రిగింద‌ని నవాల్నీ చెప్పుకొచ్చారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలను వ్యతిరేకించే నవాల్నీపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్రలు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. నవాల్నీ విషప్రయోగం వెనుక పుతిన్ హస్తం ఉందని ఆరోపించారు. అయితే నవాల్నీపై విషప్రయోగం జరగలేదని పుతిన్ ప్రభుత్వం పేర్కొంది. అలెక్సీ నవాల్నీని అరెస్ట్ చేయడం పట్ల ప్రపంచ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అమెరికా ఆరోపించింది. ఆయనను రిలీజ్ చేయాలంటూ అమెరికాతో పాటు యురోపియ‌న్ యూనియ‌న్ దేశాలు డిమాండ్ చేశాయి.

Tags:    

Similar News