వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించిన రష్యా

న్యూఢిల్లీ: కరోనాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని ప్రకటించిన రష్యా, తాజాగా, ఆ టీకా ఉత్పత్తిని ప్రారంభించింది. రక్షణ శాఖతో కలిసి గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిద్ధం చేసిన టీకా ఉత్పత్తి ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. స్పుత్నిక్-విగా నామకరణం చేసిన ఈ టీకాను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 11న ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్-వి టీకా డోసుల కోసం 20 దేశాలు అర్జీ పెట్టుకున్నాయని, సెప్టెంబర్‌లో ఉత్పత్తి […]

Update: 2020-08-15 07:05 GMT

న్యూఢిల్లీ: కరోనాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని ప్రకటించిన రష్యా, తాజాగా, ఆ టీకా ఉత్పత్తిని ప్రారంభించింది. రక్షణ శాఖతో కలిసి గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సిద్ధం చేసిన టీకా ఉత్పత్తి ప్రారంభమైందని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. స్పుత్నిక్-విగా నామకరణం చేసిన ఈ టీకాను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల 11న ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్-వి టీకా డోసుల కోసం 20 దేశాలు అర్జీ పెట్టుకున్నాయని, సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశమున్నదని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ చీఫ్ కిరిల్ డిమిత్రియేవ్ తెలిపిన సంగతి తెలిసిందే. విదేశీ సంస్థల భాగస్వామ్యంతో రష్యా ఐదు దేశాల్లో ఏడాదికి 50కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైందని వివరించారు.

Tags:    

Similar News