చెరువు కబ్జా యత్నంలో బడా నేత…?

దిశ, దుబ్బాక : అధికారంలో ఉన్నాం అడిగేవారెవరునుకున్నారో.. ఆక్రమణ చేస్తే అడ్డుకునే వారుండరనుకున్నారో.. గానీ చెరువు కబ్జాకు యత్నించాడు ఓ బడా నేత తమ్ముడు.. అనుకున్నదే తడవుగా గండి పెట్టి నీటిని తొలగించాడు.. అయితే చెరువు నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులకు విషయం తెలిసింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. ఇప్పటికీ చెరువు నీటిలో పంటలు మునిగే ఉన్నాయి.. ఘటన వివరాలిలా ఉన్నాయి… సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ […]

Update: 2020-11-09 23:53 GMT

దిశ, దుబ్బాక : అధికారంలో ఉన్నాం అడిగేవారెవరునుకున్నారో.. ఆక్రమణ చేస్తే అడ్డుకునే వారుండరనుకున్నారో.. గానీ చెరువు కబ్జాకు యత్నించాడు ఓ బడా నేత తమ్ముడు.. అనుకున్నదే తడవుగా గండి పెట్టి నీటిని తొలగించాడు.. అయితే చెరువు నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులకు విషయం తెలిసింది.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. ఇప్పటికీ చెరువు నీటిలో పంటలు మునిగే ఉన్నాయి.. ఘటన వివరాలిలా ఉన్నాయి…

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ప్రదీప్ రావు ఎనిమిదేళ్ల కిందట సుమారు 40 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాడు. కొంత వరి సాగు చేయగా, కొంత తోటలు పెంచుతున్నాడు. అయితే ఆ భూమినే ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 285 లోని బర్రెన్కల కుంటపై ప్రదీప్ రావు కన్నుపడింది. కబ్జా చేయాలని పథకం పన్ని ఆదివారం రాత్రి జేసీబీతో చెరువుకు గండి పెట్టి మత్తడి పూర్తిగా ధ్వంసం చేశారు. జేసీబీ డ్రైవర్ ను స్థానిక రైతులు ఎవరు ఈ పని చేయించారని అడగ్గా, సంతోష్ అనే వ్యక్తి చేయమన్నాడని సమాధానం ఇచ్చాడు. సంతోష్ కి ఫోన్ చేయగా ఎర్రబెల్లి ప్రదీప్​రావే చెరువును తొలగించి భూమి చదును చేయమన్నాడు అని సమాధానమిచ్చాడని వారు పేర్కొన్నారు.

కాగా, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న చెరువులకు సంబంధించిన ఏ విషయంలోనైనా కలుగ జేసుకోవాలంటే పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని ఆ శాఖాధికారులు తెలుపుతున్నారు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుకు గండి పెట్టడం, మత్తడి తొలగించడం జరిగిందని, చెరువు ధ్వంసానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.

Tags:    

Similar News