ప్రగతిభవన్ సాక్షిగా ప్రభుత్వ భూమి కబ్జా ?
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇదంతా ఎక్కడోకాదు, ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండడమే కాకుండా మేడ్చల్ జిల్లా ప్రగతిభవన్ ప్రహరీకి ఆనుకుని ఉన్న స్థలం కావడం గమనార్హం. వివరాలలోకి వెళితే.. గండిమైసమ్మ దుండిగల్ మండలం డీపోచంపల్లి సర్వేనెంబర్ 120లోని ప్రభుత్వ భూమిలో అప్పటి ప్రభుత్వం 58 జీఓ కింద ఇండ్ల పట్టాలు అందజేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ మిగిలిన ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జాకు గురవుతుందనడంలో సందేహం […]
దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇదంతా ఎక్కడోకాదు, ఏకంగా తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండడమే కాకుండా మేడ్చల్ జిల్లా ప్రగతిభవన్ ప్రహరీకి ఆనుకుని ఉన్న స్థలం కావడం గమనార్హం. వివరాలలోకి వెళితే.. గండిమైసమ్మ దుండిగల్ మండలం డీపోచంపల్లి సర్వేనెంబర్ 120లోని ప్రభుత్వ భూమిలో అప్పటి ప్రభుత్వం 58 జీఓ కింద ఇండ్ల పట్టాలు అందజేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ మిగిలిన ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జాకు గురవుతుందనడంలో సందేహం లేదనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా ప్రగతిభవన్‌కు అనుకుని సుమారు ఎకరం భూమి ఉంది. ప్రహరీకి ఆనుకుని ఉన్న ఈ భూమిని ఇటీవల ఓ జేసీబీతో చదును చేయించి ముగ్గులు వేయించారు. ఇంత జరుగుతున్నా అడ్డుకట్ట వేయకపోవడం గమనార్హం. ఈ స్థలం విలువ అక్షరాలా కోటి రూపాయల వరకు పలుకుతుందని రియల్ఎస్టేట్ వ్యాపారులు తెలియజేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతలే..?
ఈ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకోగా, కొందరు అధికార పార్టీ నేతలు ఫోన్ చేసి అటువైపు వెళ్లొద్దని సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి కౌన్సిలర్‌గా గెలిచిన ఓ యువకుడు ఈ ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఏ నిర్మాణం జరిగినా..? ఎక్కడ కబ్జా చేసినా పలానా వ్యక్తి(టీఆర్ఎస్ లోచేరిన కౌన్సిలర్) అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు తెలియజేస్తున్నారు.