జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి భగ్నం

జమ్ము కశ్మీర్‌లో మరో ఉగ్రదాడిని భద్రతాదళాలు భగ్నం చేశాయి. 20 కిలోల భారీ పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఘటన పూల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం చెక్‌పోస్ట్ వద్ద భద్రతా దళాలు తనిఖీ చేస్తుండగా.. పేలుడు పదార్థాలతో వెళ్తున్న కారును గుర్తించారు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా బారీకేడ్లను గుద్దుకుని వెళ్లాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు కారుపై కాల్పులు జరిపాయి. దీంతో డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. […]

Update: 2020-05-27 23:25 GMT

జమ్ము కశ్మీర్‌లో మరో ఉగ్రదాడిని భద్రతాదళాలు భగ్నం చేశాయి. 20 కిలోల భారీ పేలుడు పదార్థాలతో వెళ్తున్న ఓ కారును భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఘటన పూల్వామా జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం చెక్‌పోస్ట్ వద్ద భద్రతా దళాలు తనిఖీ చేస్తుండగా.. పేలుడు పదార్థాలతో వెళ్తున్న కారును గుర్తించారు. అయితే డ్రైవర్ కారును ఆపకుండా బారీకేడ్లను గుద్దుకుని వెళ్లాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు కారుపై కాల్పులు జరిపాయి. దీంతో డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. అనంతరం కారును తనిఖీ చేయగా 20 కిలోల భారీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు. ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా కారు పట్టుబడిందని ఆయన తెలిపారు. బాంబ్ స్వ్కాండ్ ఆధ్వర్యంలో కారుతో పాటు పేలుడు పదార్థాలను ధ్వంసం చేసే క్రమంలో సమీపంలోని ఇళ్లకూ బీటలు వారినట్లు ఆయన తెలిపారు. సైన్యం, కశ్మీర్ పోలీసులు, పారా మిలటరీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

Tags:    

Similar News