ప్రయాణికులకు గమనిక : అక్కడికి వెళ్లాలంటే ఆ రిపోర్టు తప్పనిసరి

లక్నో: యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి వచ్చే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నతాధికారులతో సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ప్రయాణీకుడు యూపీలోకి రావాలంటే […]

Update: 2021-07-18 08:34 GMT

లక్నో: యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 3 శాతం కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి వచ్చే ప్రయాణీకులకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నతాధికారులతో సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ప్రయాణీకుడు యూపీలోకి రావాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు అందజేయాల్సి ఉంటుంది. కాగా ఈ రిపోర్టు ప్రయాణీకులు రాష్ట్రంలోకి ప్రవేశించే నాటికి కనీసం నాలుగు రోజుల ముందు తేదిల్లో తీసుకున్నదై ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News