బీజేపీ వైపు అశ్వత్థామరెడ్డి ?
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మిక నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. బీజేపీ నుంచి కూడా ఆయనను ఆహ్వానిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నాలతో పాటు అనంతర పరిణామాల నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఆర్టీసీ ఉద్యమ సమయంలోనే ఆయన బీజేపీతో చేతులు కలిపారని, అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కార్మికులను […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మిక నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. బీజేపీ నుంచి కూడా ఆయనను ఆహ్వానిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నాలతో పాటు అనంతర పరిణామాల నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఆర్టీసీ ఉద్యమ సమయంలోనే ఆయన బీజేపీతో చేతులు కలిపారని, అందుకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కార్మికులను నడిపిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఆరోపణలకు వెరవకుండా ఆయన ఉద్యమాన్ని కొనసాగించారు.
అయితే ఉద్యమం తర్వాత టీఎంయూని చీల్చేందుకు అధికార పార్టీ ప్రయత్నించం తెలిసిందే. దీనిలో భాగంగానే థామస్రెడ్డితో అశ్వత్థామరెడ్డిపై ఆరోపణలు గుప్పించింది. దీంతో అశ్వత్థామను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ నేతలతో చర్చలు జరపటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అశ్వత్థామరెడ్డి బీజేపీలో చేరితే గ్రేటర్ ఆర్టీసీలోని కార్మిక వర్గం అంతా ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో త్వరలోనే ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.