ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా ప్రభావంతో ఆర్టీసీ తీవ్ర నష్టాలను చవిచూసింది. తాజాగా ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నెల సగం గడిచినా.. జీతాల జాడ లేకపోవడంతో ఉద్యోగులలో ఆ౦దోళన మొదలైంది. జీతాల కొరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 16 వ తేదీ వచ్చిన మే నెల జీతం రానందున నిర్మల్ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా […]

Update: 2021-06-16 03:59 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా ప్రభావంతో ఆర్టీసీ తీవ్ర నష్టాలను చవిచూసింది. తాజాగా ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నెల సగం గడిచినా.. జీతాల జాడ లేకపోవడంతో ఉద్యోగులలో ఆ౦దోళన మొదలైంది. జీతాల కొరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 16 వ తేదీ వచ్చిన మే నెల జీతం రానందున నిర్మల్ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా సరిగ్గా బస్సులు నడవక పోగా ఆదాయం రాక యాజమాన్యం ప్రభుత్వంతో మాట్లాడి జీతాలు ఇప్పంచాలి అని కోరారు. అసలే చిన్న జీతాలు ఇంటి అద్దెలు కట్టలేక, సరుకులు కొనలేక సతమత మవుతున్నామని ఉద్యోగులుపేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఈ. పోశెట్టి, సుంకరి రమేష్, పి.నారాయణ, బుకింగ్ శేఖర్, శ్రీహరి, సలీం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News