ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున టేక్రియల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. […]

Update: 2021-02-13 21:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోచోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున టేక్రియల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News